గోపన్‌పల్లిలో ఘటన
తాండూరు రూరల్: మండల పరిఽధిలోని గౌతపూర్ అను బంధ గ్రామం గోపన్‌పల్లిలో పల్లె ప్రకృతికి కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. గోపన్‌పల్లిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 6లో అరఎకరాను గతంలో ప్రకృతి వనానికి కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత నీటి సౌకర్యం లేకపోవడంతో వదిలేశారు. పల్లె ప్రకృతికి కేటాయించిన భూమిలో షబ్బిర్ అనే వ్యక్తి జేసీబీతో చదును చేయిస్తున్నారు. ఈ విషయమై అతన్ని వివరాలు అడగగా తన సొదరి షాహేదబేగానికి సంబంధించిన భూమి అని, గతంలో అధికారులు అడిగితే ఇచ్చారన్నారు. ప్రస్తుతం వాడుకలో లేకపోవడంతో సాగు చేసుకుంటున్నామని షబ్బిర్ బదులిచ్చారు. ఈ విషయంలో గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి సెలవుల్లో ఉన్నారని, సోమవారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment