రేషన్ దుకాణం సీజ్
శంకర్‌పల్లి: మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ రేషన్ దుకాణంపై గురువారం సివిల్‌సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. యాదయ్యగౌడ్ నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలున్నాయని.. వీటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని పలువురు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సివిల్‌సప్లై అధికారులు ఆకస్మికంగా దాడి చేసి దుకాణం సీజ్ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచారో శుక్రవారం లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సురేందర్‌ను వివరణ కోరగా సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు రేషన్ దుకాణం వద్దకు ఆర్‌ఐను పంపామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment