ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
తాండూరు టౌన్: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,084 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 18 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,554 మంది విద్యార్థులకు గాను 1,541 మంది, ఒకేషనల్‌ల్లో 530 మంది విద్యార్థులకు గాను 525 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
అనంతగిరిలో..
అనంతగిరి: ఉదయం నిర్ణీత సమయానికి విద్యార్థులు వారివారి సెంటర్లకు చేరుకున్నారు. అక్కడ అధ్యాపకులు చెక్ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు. మొత్తం 6,931మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 6,818మంది హాజరయ్యారు. 113మంది గైర్హాజరయ్యారు. వికారాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ భీంకుమార్ తదితరులు ఉన్నారు.
కొడంగల్ రూరల్‌లో..
కొడంగల్ రూరల్: పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని రెండు సెంటర్లలో ఇంటర్‌మీడియట్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం, అరబిక్ పరీక్షలు నిర్వహించారు. సెంటర్–ఏలో 243మంది విద్యార్థులకుగాను 239మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సెంటర్–బీలో 302మంది విద్యార్థులకుగాను 301మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్షల కేంద్రాలను తహసీల్దార్ విజయకుమార్ పరిశీలించారు.
కుల్కచర్లలో..
కుల్కచర్ల: కుల్కచర్ల మండల కేంద్రంలోని వివేకనంద కళశాల, రామలింగేశ్వర కళశాలలో ద్వితియ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివేకనంద కళశాలలో 180మందికిగాను 10మంది గైర్హాజరుకాగా, రామలింగేశ్వర కళశాలలో 183మందికిగాను ఒకరు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment