ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
అనంతగిరి: వినియోగదారులు నిత్య జీవితంలో తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ వహించాలని ఎస్‌బీఐ వికారాబాద్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ విఠల్ ఓరుగంటి, ఆర్‌బీఓ (రీజినల్ బిజెనెస్ ఆఫీస్) వికారాబాద్ చీఫ్ మేనేజర్ బరుణ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో మహావీర్ జనరల్ ఆస్పత్రి వైద్యులచే బ్యాంకు వినియోగదారులు సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించొదన్నారు. నిత్యం ఉదయం యోగా, వాకింగ్ చేయాలని సూచించారు. నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం ఒక గంట ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా తన సేవలను క్షేత్రస్థాయిలో సైతం అందిస్తుందన్నారు. బ్యాంకు సేవలను వినియోగదారులు ఆదరిస్తున్నందునా అతిపెద్ద బ్యాంకుగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ స్వాతి, ఫీల్డ్ ఆఫీసర్లు సంధ్య, జయవర్దన్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ వినియోగదారులకు
ఉచిత వైద్య శిబిరం
Comments
Please login to add a commentAdd a comment