గౌతపూర్‌లో గొర్రెల దొంగతనం
తాండూరు రూరల్: గొర్రెలను ఎత్తుకెళ్లిన సంఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌతపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె పెద్ద రాములు గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. రాత్రి సమయంలో వాటిని ఇంటి పక్కనే ఉన్న దొడ్డిలో ఉంచి గేటుకు తాళం వేసి ఇంట్లో పడుకోవడానికి వెళ్లేవాడు. బుధవారం అర్ధరాత్రి 1 గంటకు గుర్తు తెలియని దుండగులు నల్లా స్కార్‌పియోలో వచ్చి ఇంటి సమీపంలోని దొడ్డి వద్దకు వెళ్లి గేటు తాళం పగుల గొట్టి 6 గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఇందులో ఓ పొటేలు కూడా ఉందన్నారు. వీటి విలువ రూ.60 వేలలోపు ఉంటుందన్నారు. స్కార్‌పియోలో వచ్చి గొర్రెలను దొంగిలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
స్కార్‌పియో వాహనంలో వచ్చి అపహరించిన దుండగులు
సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
Comments
Please login to add a commentAdd a comment