మీర్‌పేట: సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం వద్ద గురువారం చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే సాంకేతిక పరికరం పాప్లాన్‌ను ఆయన పరీక్షించారు. అనంతరం నేరు గా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ పనితీరుపై ఆరా తీశారు. సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, శాంతిభద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు సూచించారు.
రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment