ఎలుకల సమస్య ఉండొద్దు
● ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట: పాఠశాలలో ఎలుకల సమస్య ఉండరాదని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సిబ్బందికి సూచించారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరో గ్యం గురించి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఎలుకలు ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, నాయకులు, పాఠశాల సిబ్బంది నాగిరెడ్డి, ప్రశాంత్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, రాజ్‌శేఖర్‌రెడ్డి, ఖదీర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment