
తాండూరు నుంచే బీసీ ఉద్యమం
తాండూరు టౌన్: యాభై ఏళ్ల క్రితం తాండూరు నుంచే బీసీ ఉద్యమం ప్రారంభమైందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను సంఘం తాండూరు శ్రేణులు, బీసీ మహిళా సంఘం నాయకులు నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధనకు పోరాడుతూనే విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలో ఢిల్లీ స్థాయిలో నిర్వహించనున ఉద్యమానికి బీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం నాయకులు మధులత, అనిత, మంజుల, నర్సమ్మ, జగదీశ్వరి, నాయకులు లక్ష్మణాచారి, శ్రీనివాస్, అరుణ్‌రాజ్, విజయ్, ఫయాజ్, రాములు తదితరులు ఉన్నారు.
బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment