
పెండింగ్ వేతనాలు చెల్లించండి
కేశంపేట: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలిసి పంచాయతీ రాజ్ డిప్యూటీ డైరెక్టర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన రామారావు వచ్చే బడ్జెట్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా ప్రతీ నెల 1న వేతనాలు అందేలా చూస్తామన్నారు. టీస్‌బీఎస్ ద్వారా ఫిబ్రవరి వరకు ఉన్న వేతనాలను మంగళవారం వరకు చెల్లిస్తామన్నారు జనరల్ ఫండ్స్‌లో జనరేట్ చేసిన వేతనాల చెక్కులను క్లియర్ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, మల్లయ్య, జిల్లా నాయకులు రాంచంద్రయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment