
ఆలయంలో విగ్రహాలు మాయం
మొయినాబాద్: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆలయంలోని మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఓ పురాతన ఆలయం ఉంది. అందులో మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలున్నాయి. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చినవారికి ఆలయంలో విగ్రహాలు కనిపించకపోవడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో పనిచేసే ఓ ఏఎన్‌ఎం కొత కాలంగా మతిస్థిమితం సరిగాలేక పూనకంతో ఊగిపోతోందని.. ఆలయానికి ఉన్న టైల్స్‌ను కొంత కాలంగా తానే తొలగించిందని.. విగ్రహాన్ని సైతం ఆమె మాయం చేసి ఉండవచ్చని సిబ్బంది చెప్పారు. ఈ విషయంపై బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధి చెప్పారు.
బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన
పోలీసులకు ఫిర్యాదు
మతిస్థిమితం సరిగా లేని ఏఎన్‌ఎం తీసినట్లు చెబుతున్న వైద్య సిబ్బంది
మానసిక రోగంతోనే..
పీహెచ్‌సీలో పనిచేసే గంగా అనే ఏఎన్‌ఎం మానసిక పరిస్థితి కొంత కాలంగా సరిగా లేదు. ఆలయం వద్ద పూజలు చేస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెల్లాం. మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ తెప్పిస్తే సిబ్బందిని బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసింది. ఎవరైనా దగ్గరకు వస్తే చనిపోతానని బెదిరిస్తుంది. మతిస్థిమితం సరిగా లేని గంగా విగ్రహాలను తొలగించి ఉంటుందని భావిస్తున్నాం.
– అన్నపూర్ణ, వైద్యాధికారి, మొయినాబాద్

ఆలయంలో విగ్రహాలు మాయం
Comments
Please login to add a commentAdd a comment