
సీపీఎస్ రద్దుకు డిమాండ్
కొడంగల్: సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు పాఠశాలల్లో ఉద్యోగులతో కలిసి సీపీఎస్ రద్దు చే యాలనే డిమాండ్‌తో పోస్టర్లను ఆవిష్కరించారు. ఫ్యామిలీ పెన్షన్ లోపాలు, ప్రభుత్వం చెల్లించే మ్యా చింగ్ గ్రాంట్స్ జమ కాకపోవడం తదితర అంశా లను పరిష్కరించాలని కోరారు. సీపీఎస్‌ను అంత రం చేసి పాత పెన్షన్ అమలయ్యే వరకు నిరంతరం పోరాడుతామని హెచ్చరించారు. ఉద్యోగులంతా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉపాధ్యక్షుడు అశోక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment