
80 కేసులకు పరిష్కారం
కొడంగల్ రూరల్: కేసుల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తోందని మున్సిఫ్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి శ్రీరామ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు పలు సూచనలు ఇచ్చారు. పేదలకు కోర్టు ఖర్చుల భారం లేకుండా లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు. కోర్టు సమయాన్ని వృథా చేయకుండా అవగాహనతో రాజీతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఎకై ్సజ్‌కు సంబంధించి 40, డ్రంకెన్‌డ్రైవ్ 32, నేరం అంగీరించినవి నాలుగు, మరో నాలుగు క్రిమినల్ కేసులతో మొత్తం 80 కేసులను పరిష్కరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు బస్వరాజు, బాగ్యలత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటయ్య, సీనియర్ న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, కృష్ణ, మొహీద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment