
విద్యతోనే ఏదైనా సాధ్యం
అనంతగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులతో కలిసి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతీ ఒక్కరు అమ్మాయిలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. విద్యతోనే అన్నీ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, కార్యదర్శి వెంకటేశ్, న్యాయవాదులు వసుంధర, పద్మలత, జయలతారెడ్డి, శ్రీలత, సుమలత, పూజ, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డీబీ శీతల్
Comments
Please login to add a commentAdd a comment