
రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి ● లోక్ అదాలత్‌లో1,631 కేసుల పరిష్కారం
అనంతగిరి: లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కోర్టుల పరిధిలో మొత్తం 1,631 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లు అన్ని కోర్టుల్లో కొనసాగుతాయన్నారు. ఇరువర్గాలు విశాల ధృక్ఫథంతో ఆలోచిస్తే కేసుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. ప్రతి వ్యక్తీ చట్టాలపై కనీస అవగాహన ఉండాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, ఎస్పీ నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, పీపీలు అన్వేషింగ్, సమీనాబేగం, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment