
బలవంతపు భూసేకరణ చేస్తే..
మరో పోరాటం తప్పదు
● మండలంలో ఉపాధి హామీపనులను ప్రారంభించాలి ● వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
దుద్యాల్: పరిశ్రమల పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తే మరో పోరాటం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్‌రాములు అన్నారు. శనివారం మండలంలోని లగచర్ల గ్రామంలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచర్ల, హకీంపేట్, రోటిబండ తండా, పులిచర్ల కుంట తండా, పోలేపల్లి గ్రామాల రైతులు అంగీకరిస్తేనే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాకాకుండా బలవంతంగా, బెదిరించి భూములు తీసుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. అలాగే మండలంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, జిల్లా నాయకులు సత్తయ్య, సీ సత్యయ్య, రైతు బసప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment