
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి
తాండూరు రూరల్: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గాజీపూర్ నారా యణరెడ్డి అన్నారు. ఎల్‌ఎన్‌ఆర్ యువసేన, హైదరాబాద్‌లోని శంకర్ కంటి ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో శనివారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు సేవ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతున్న సందర్భంలో ఎల్‌ఎన్‌ఆర్ యువసేన, శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు. 300మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 50 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి హైదరాబాద్ తరలించారు. కార్యక్రమంలో ఎల్‌ఎన్‌ఆర్ యువసేన అధ్యక్షుడు లొంక నర్సింలు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు లాల్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సంగమేశ్వర్, బిచ్చన్న, బీ నర్సింలు, నాగభూషణం, రవి, రామకృష్ణ, రాములు, ప్రవీణ్, రాము జాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment