రేపు మహిళా జాబ్ మేళా
పూడూరు: ఈ నెల 11న పరిగిలో నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ కార్యదర్శి పెంటయ్య సూచించారు. మంగళవారం ఉదయం 10గంటలకు పరిగి జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో ఈ మేళా ఉంటుందని చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన మహిళలు సర్టిఫికెట్‌లతో హాజరవ్వాలని సూచించారు. ఎంపికై న వారికి ఎమ్‌ఎస్‌ఎన్ కంపెనీలో వసతితో కూడిన ఉద్యోగం ఉంటుందని చెప్పారు.
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో వంద సీట్లు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీసీ విద్యార్థులకు రూ.125, ఓసీలకు రూ.200 దరఖాస్తు రుసుము ఉంటుందని చెప్పారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని ఏప్రిల్ 20న పరీక్ష ఉంటుందని చెప్పారు.
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
ధారూరు ఎస్‌ఐ అనిత
ధారూరు: వ్యాపారస్తులు సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని ధారూరు ఎస్‌ఐ అనిత సూచించారు. ఆదివారం ఆమె పీఎస్‌లో వ్యాపారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్త పడాలని సూచించారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ను నేరస్తుల కంటబడకుండా అమర్చుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో వ్యాపారులు సాయికుమార్, షకీల్‌బాబా, శేఖర్, రఘు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి
కేశంపేట: అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పలో మృతి చెందిన కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శంషాబాద్ నుంచి కేశంపేటకు తరలించి అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి వేర్వేరుగా నివాళి అర్పించారు.
సమన్వయ కమిటీలో ‘చల్లా’కు చోటు
ఆమనగల్లు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే జైబాపు, జై బీమ్, జై సంవిదాన్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరుగురు సభ్యులతో రాష్ట్ర సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో సమన్వయకమిటీ సభ్యుడిగా చల్లా వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పించారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి
శంకర్‌పల్లి: దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు భుజంగరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిధ్యం కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం మండలంలోని జన్వాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో దివ్యాంగులు 12 శాతం ఉన్నారని, అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో రెండు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఇద్దరు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రత్యేక చట్టం అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అదే తరహా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలన్నారు.
రేపు మహిళా జాబ్ మేళా
రేపు మహిళా జాబ్ మేళా
Comments
Please login to add a commentAdd a comment