
మహిళా సంఘాల ఎన్నికల సందడి
కోలాహలంగా గ్రామ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ
● ఆమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ల బాధ్యత నేపథ్యంలో పెరిగిన పోటీ
● బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్త్ను సెర్ప్ అధికారులు
కుల్కచర్ల: పొదుపు సంఘాల పర్యవేక్షణకు బాధ్యత వహించే గ్రామ పొదుపు సంఘాల ఎన్నికలతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలో 37 పంచాయతీలుండగా 30 గ్రామ సంఘాలున్నాయి. చౌడాపూర్ మండల పరిధిలో 24 గ్రామాలకుగాను 17 గ్రామ సంఘాలున్నాయి. ఒక్కో గ్రామానికి ఒక మహిళా అధ్యక్షురాలు ఉంటారు. వీరు గ్రామ సంఘం పరిధిలోని పొదుపు సంఘాలకు బాధ్యత వహిస్తారు.
పెరిగిన పోటీ
గతంలో గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోటీ చేసేందుకు మహిళలు పెద్దగా ఆసక్తిచూపేవారు కాదు. ప్రస్తుతం గ్రామ సంఘం అధ్యక్షులకు అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్‌లుగా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో అవగాహన ఉన్న స్థానిక నాయకులు తమ భార్యలను గ్రామ సంఘం అధ్యక్షులుగా ఎంపికయ్యేలా చూసుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు సైతం చైర్‌పర్సన్‌లుగా ఎంపికయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వీరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అధ్యక్ష ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా ఉన్నాయి.
ఎన్నిక ప్రక్రియ
పొదుపు సంఘాలలో ఉన్న సభ్యులు తమ గ్రామ సంఘానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్నికల విధానంలో ముందుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు తమ పొదుపు సంఘం నుంచి ఎన్నికవ్వాలి. అనంతరం తమ పరిధిలో ఉన్న పొదుపు సంఘాలతో పోటీ పడి 30మంది రిప్రజెంటివ్ జనరల్ బాడీ కమిటీ సభ్యులుగా ఎంపికవ్వాలి. అనంతరం 15 మంది ఎగ్జిగ్యూటీవ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరికి ఓటింగ్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించి గ్రామ సంఘం అధ్యక్షులుగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, సహాయకార్యదర్శిగా, కోశాధికారిగా ఐదుగురి కమిటీని ఎంపిక చేసి ప్రక్రియను పూర్తిచేస్తారు చురుకుగా ఉన్న సంఘం సభ్యులకు, సంఘం వాటధనం, రీపేమెంట్ యాక్టీవ్‌గా చేసే సంఘం సభ్యులకు తదితర కొన్ని నిబంధనలతో సంఘం ఎన్నికలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు గ్రామ సంఘం అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది.
14 లోగా పూర్తి
గ్రామాల్లో సీసీల ఆధ్దర్యంలో గ్రామ సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కొత్త నిబంధనలను అనుసరించి ఓటింగ్ పద్ధతిని అవలంబిస్తూ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటగా గ్రామ సంఘాల ఎన్నికలు నిర్వహించి అనంతరం మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14లోపు గ్రామ సంఘాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తాం.
– శోభ, ఏపీఎం, కుల్కచర్ల

మహిళా సంఘాల ఎన్నికల సందడి

మహిళా సంఘాల ఎన్నికల సందడి
Comments
Please login to add a commentAdd a comment