
నియోజకవర్గ అభివృద్ధికి రూ.340 కోట్లు
పరిగి: నియోజకవర్గ పరిధిలో రూ.340 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిగి పట్టణ కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. మొదట పరిగి నుంచి వికారాబాద్ నాలుగులేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు, పరిగి–షాద్‌నగర్‌కు రూ.120 కోట్లు, గడిసింగాపూర్ –రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.వంద కోట్లు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని నంబర్–1 ఉన్నత పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని సూచించారు. అనంతరం రూ.29 లక్షలతో పట్టణ కేంద్రంలోని కొత్తకుంట చెరువు పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ అయూబ్, నాయకులు రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీవేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు
పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షి క బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన లక్ష తులసీ అర్చన, చండీహోమం, మహా పూర్ణాహుతిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరుశురాంరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్ పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment