
మహిళా శక్తి సృష్టిలోనే గొప్పది
తాండూరు టౌన్: సృష్టిలోనే మహిళా శక్తి గొప్పదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎస్వీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలు రంగాల్లో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలను సృష్టిస్తారన్నారు. మహిళలు గౌరవ మర్యాదలు అందుకునే చోట దేవతలు కొలువై ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు 150 అద్దె బస్సుల నిర్వహణ వంటి పథకాలు అమలు చేసిందన్నారు.
‘317 జీఓ బాధితులకు న్యాయం చేయండి’
317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కోరారు. సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 317 జీఓ పేరిట పలు విభాగాల్లో ఉద్యోగులు రాత్రికిరాత్రే ఇళ్లు, పిల్లలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జీఓ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment