హెడ్‌కానిస్టేబుల్ మృతి
తాండూరు రూరల్: గుండెపోటుతో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. యాలాల మండలం జక్కెపల్లికి చెందిన రాంచందర్‌రావు(55) హెడ్ కానిస్టేబుల్. ఆయన మండలంలోని గౌతపూర్ సమీపంలోని రూరల్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాపిల్లలతో కలిసి పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసముంటున్నారు. నెల రోజుల క్రితం రాంచందర్‌రావుకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి మృతి చెందారు. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాంచందర్‌రావు అందరితో కలివిడిగా ఉండేవాడని పోలీసులు గుర్తు చేసుకున్నారు. రాంచందర్‌రావు మృతిపై డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు సంతోష్, నగేష్, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
హెడ్‌కానిస్టేబుల్ మృతి
Comments
Please login to add a commentAdd a comment