‘పీఎం విశ్వకర్మ’ను పక్కాగా అమలు చేయాలి
● పథకంపై అవగాహన కల్పించండి ● అడిషనల్ కలెక్టర్ సుధీర్
అనంతగిరి: సంప్రదాయ చేతివృత్తుల వారి ఆర్థిక పురోగతికి పీఎం విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవా రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పథకం అమలు, పురోగతిపై వివిధ శాఖల అధికారు లు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు తోడ్పాటునందించాలన్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి తదితర 18 రకాల చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పథకంపై అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ వృత్తుల్లో శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ మహేశ్వర్, జిల్లా పంచాయతీ అధి కారి జయసుధ, డీబీసీడీఓ ఉపేందర్, మెప్మా పీడీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment