వెలుగులోకి వచ్చింది ఇలా..
తాండూరు మండలం ఖాంజాపూర్ వాగు నుంచి పెద్దేము ల్ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పను లకు వెళ్లాల్సిన ఇసుక ట్రాక్టర్లు మంబాపూర్ వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. దీంతో అసలు విషయం బయట పడింది. నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బషీర్‌మియా తండాలో కూడా ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. పాత ప్రొసీడింగ్ కాపీలకు ఇసుక పర్మిషన్లు ఇచ్చారనే విషయం తాండూరులో చర్చనీయంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment