
బంధువుల ఇంటికి వెళ్లి దారితప్పిన మహిళ
తాండూరు రూరల్: బంధువుల ఇంటికి వెళ్లిన ఓ మహిళ దారి తప్పిపోయింది. అటవీ ప్రాంతాంలో చిక్కుకోవడంతో ఉపాధి కూలీలు గుర్తించారు. ఆమె వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు తెలపడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..తాండూరు మండలం చెన్‌గేస్‌పూర్ అనుబంధ గ్రామం కోనాపూర్‌కు చెందిన మాల ఇందిరమ్మ చెంగోల్లోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లింది. తిరిగి బైపాస్‌రోడ్డు నుంచి గౌతపూర్ చౌరస్తాకు వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒంటరిగా వెళ్తున్న ఇందిరమ్మ దారి తప్పింది. గోట్లపల్లి అటవీప్రాంతంలో చిక్కుకుంది. అంతారం గ్రామ ఉపాధి కూలీలు ఆమెను గుర్తించి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కోనాపూర్ గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వచ్చి ఇందిరమ్మను కోనాపూర్‌కు తీసుకెళ్లారు.
ఉపాధి కూలీల సమాచారంతో ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment