
ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
బంజారా హిల్స్: పంజాగుట్ట చౌరస్తా నుంచి అమీర్‌పేట వరకు రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, డబ్బాలను పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్‌లో భాగంగా మంగళవారం తొలగించారు. వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ పర్యవేక్షణలో పంజగుట్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా..ట్రాఫిక్ పోలీసులు సుమారు 70 ఆక్రమణలను ఈ సందర్భంగా తొలగించారు. దీంతో పాదచారులు, వాహనదారులు తేలికగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడింది. గత కొన్నాళ్లుగా పంజగుట్ట– అమీర్‌పేట రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాతల ఆక్రమణలతో రోడ్డు కుదించుకుపోయింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఫిర్యాదులు అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వీటిని తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment