
నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
పరిగి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నియోజవకర్గంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి అర్హుల జాబితాను కమిటీ సభ్యులు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరికి ఇల్లు అవసరం అనేది గ్రామ స్థాయి నాయకులకు, కమిటీ సభ్యులకే తెలుస్తుందన్నారు. కాబట్టి అట్టడుగు వర్గాల పేదలకు ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కాని సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారన్నారు. త్వరలోనే రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
నియోజకవర్గంలో రూ.340 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పరిగి నుంచి వికారాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు, పరిగి షాద్‌నగర్ వరకు నాలుగు లైన్లకు రూ.120 కోట్లు, గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరయ్యాయని, ఆయా పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పరిగి పట్టణ కేంద్రంలో కొత్తచెరువు పుననిర్మాణానికి రూ. 29లక్షలతో పనులను ప్రారంభించామన్నారు. కొత్త చెరువు పనులు పూర్తవగానే పరిగికి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పరిగిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తను అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులు, దోమ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఆయ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ మంజూరు చేస్తాం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment