
పాత్రికేయులు క్రమశిక్షణతో మెలగాలి
శంకర్‌పల్లి: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు సైతం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ఈ జర్నలిస్ట్ యూనియన్ 1957లో ప్రారంభించారని, ప్రస్తుతం ఎన్ని కొత్త యూనియన్లు వచ్చినా.. పద్ధతి ప్రకారం నడిచేది టీయూడబ్ల్యూజే మాత్రమేనని స్పష్టం చేశారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని, యూనియన్ల ప్రతిష్టను దిగజార్చుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హామీలు ఇవ్వడం తప్ప.. అమలు చేసింది లేదన్నారు. బీఆర్‌ఎస్ నేత కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులతో తనకు అనుబంధముందని, ఇదే ధోరణిని మున్ముందు కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం వివిధ ప్రతికల్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన పాత్రికేయులందరికీ టీయూడబ్ల్యూజే తరఫున సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సలీం పాషా పాల్గొన్నారు.
ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్
టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా సలీం పాషా
టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌పల్లి పట్టణానికి చెందిన ఎండీ.సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా మేకల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ద్వితీయ మహాసభల్లో ప్రకటించారు. జర్నలిస్టు నాయకులు సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వరకు అధ్యక్షుడిగా పని చేసిన శ్రీకాంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

పాత్రికేయులు క్రమశిక్షణతో మెలగాలి
Comments
Please login to add a commentAdd a comment