
పరిగిని రెవెన్యూ డివిజన్ చేయాలి
పరిగి: పరిగి నియోజవర్గాన్ని నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని టీజేఏసీ జిల్లా చైర్మన్ ముకుందనాగేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆయా మండలాల టీజేఏసీ, నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం అవకాశం ఉన్న గ్రామాలను కలిపి నూతన మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూడూర్ మండలంలో కంకల్, దోమలో దాదాపూర్, దిర్సంపల్లి, గండ్వీడ్ మండలంలో వెన్నచేడ్, చౌడాపూర్‌లో మరికల్ గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాక నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అనుబంధ గ్రామాలుగా ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో పరిగి అభివృద్ధికి ఇచ్చిన హామీలను వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు గోపాల్‌రెడ్డి, గోవింద్‌నాయక్, భానుప్రకాశ్, రవీందర్, వెంకట్‌రాములు, కృష్ణయ్య, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
టీ జేఏసీ జిల్లా చైర్మన్ ముకుందనాగేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment