
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్‌నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్య ంలో షాద్‌నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ
Comments
Please login to add a commentAdd a comment