
మిగిలింది
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
10లోu
వికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా కనిపించడం లేదు. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో పూర్తి కావస్తున్నా మంజూరైన పనుల్లో సగం కూడా పూర్తి చేయలేకపోయారు. జిల్లాకు 811 పనులు.. రూ.54.28 కోట్లు మంజూరయ్యాయి. సకాలంలో నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. గతేడాది కూడా వందశాతం లక్ష్యం చేరుకోలేకపోయారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
492 పనులు పూర్తి
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ శాతం సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 75 శాతం మేర పనులను ప్రారంభించారు. ఇందులో 50 శాతం అంటే 492 పనులను పూర్తి చేశారు. మరో 50 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. వారం రోజుల్లో మిగిలిన పనులన్నింటినీ ప్రారంభించి 20 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో పనుల బాధ్యత అధికారులపైనే పడింది.
కార్యకర్తలకే పనుల బాధ్యతలు
ఉపాధి హామీ పథకం పనులు వందల్లో.. సమయం రోజుల్లో ఉండటంతో వాటిని ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేల సూచనల మేరకు అధికారులు పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగిస్తున్నారు. వీరికి అధికారికంగా ఏ బాధ్యతలు లేకపోవటంతో ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఒకవేళ పనులు పూర్తి చేయాలని తొందరపెడితే నాణ్యత పాటిస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గతేడాది కూడా ఇదే తరహాలో హడావుడి చేసినా చాలా వరకు పనులు మిగిలి పోయాయి. ప్రత్యేక అనుమతులు తీసుకొని పనులను పూర్తి చేయాల్సి వచ్చింది.
న్యూస్‌రీల్
రోజులే..
ఈ నెల చివరి నాటికి ముగియనున్న ఉపాధి హామీ పనుల గడువు
జిల్లాకు మంజూరైన పనులు 811
ఖర్చు చేయాల్సిన నిధులు రూ.54.28 కోట్లు
ఇప్పటి వరకు పూర్తి చేసింది 50శాతమే
నాణ్యత విషయంలో రాజీ పడం
ఉపాధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. నాణ్యత విషయంలో రాజీ పడం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– ఉమేశ్, పీఆర్ ఈఈ, వికారాబాద్

మిగిలింది

మిగిలింది
Comments
Please login to add a commentAdd a comment