
17న ఆలయ భూములకు కౌలు వేలం
ఈఓ నరేందర్
మోమిన్‌పేట: మండలంలోని ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు ఈ నెల 17న వేలం నిర్వహించనున్నట్లు ఈఓ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోమిన్‌పేటలోని బాలజీ, మాణిక్ ప్రభు, విఠలేశ్వర స్వామి ఆలయ భూములను మూడు సంవత్సరాలపాటు సాగు చేసుకునేందుకు కౌలుకు ఇస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే రైతులు రూ.3 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు మాణిక్ ప్రభు ఆలయంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
గ్రూప్ –2 ఫలితాల్లో మెరిసిన తిర్మలాపూర్ వాసి
26వ ర్యాంక్ సాధించిన రాఘవేందర్ గౌడ్
కుల్కచర్ల: తెలంగాణ గ్రూప్ –2 పరీక్ష ఫలితాల్లో కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్ గౌడ్ 26వ ర్యాంక్ సాధించారు. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాలను విడుదల చేసింది. తిర్మలాపూర్‌కు చెందిన బల్ల రవీందర్ కుమారుడు రాఘవేందర్ ఉత్తమ ర్యాంక్ సాధించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందనలు తెలిపారు.
హామీలు అమలు చేయాలి
హామీలు అమలు చేయాలి
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి
రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్
పరిగి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా హామీలను అమలు చేయడం లేదన్నారు. పింఛను మొత్తాన్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ.4వేలు ఇవ్వాలని కోరారు.
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
రూ.1.10 లక్షల నగదు అందజేసిన సబ్ డివిజన్ పోలీసులు
తాండూరు టౌన్: గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి సబ్ డివిజన్ పోలీసులు ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.1.10 లక్షల నగదు అందజేశారు. పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే కావలి రవీందర్ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తోడుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్సైలు గిరి, విఠల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పెద్దేముల్ పోలీసులు మాసయ్య, ముంతాజ్, పర్వీన్ పాల్గొన్నారు.
దరఖాస్తుల గడువు పొడిగింపు
ఉస్మానియాయూనివర్సిటీ: ఓయూ కేటగిరి–2 పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. రూ.2000 అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగా రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 11తో గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీ పొడిగించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్–2025కు ఇంత వరకు 9500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

17న ఆలయ భూములకు కౌలు వేలం
Comments
Please login to add a commentAdd a comment