సారు రూటు.. సప‘రేటు’ | - | Sakshi
Sakshi News home page

సారు రూటు.. సప‘రేటు’

Mar 18 2025 10:18 PM | Updated on Mar 18 2025 10:12 PM

బషీరాబాద్‌: అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఓ రెవెన్యూ అధికారి చేతులు తడపందే ఏ పనీ చేయడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఎవరైనా సరే ముడుపులు ముట్టజెప్పందే ఫైలు ముట్టుకోడు. ఎంతోకొంత అప్పగించందే సారు సంతకం పెట్టరు. కొంతమంది అక్రమార్కులతో కుమ్మకై ్క ప్రభుత్వ సంపదను పక్కదారి పట్టిస్తున్నారు. ఈయన అవినీతి లీలలపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సారు తీరుపై నిఘా పెట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ విషయం తెలియడంతో బదిలీ కోసం విశ్వప్రయత్నాలుచేస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

● ఇటీవల ఓ రైతు తన భూమి పట్టా మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వచ్చాడు. ఒరిజినల్‌ పాసు పుస్తకం ఎక్కడో పోయిందని, పట్టామార్పు చేయాలని అడిగాడు. అయితే పని కావాలంటే రూ.10 వేలు కావాలని మధ్యవర్తి ద్వారా రాయభారం నెరిపాడు. అంత డబ్బు తన వద్ద లేదని రైతు ఎంత వేడుకున్నా కనికరించలేదు. చివరకు ఈ విషయం మీడియాకు లీక్‌ కావడంతో చివరికి రూ.5 వేలు తీసుకుని పని పూర్తి చేశాడు.

● మండల పరిధిలోని పలు గ్రామాల్లో కోర్టు కేసులు ఉన్న చాలా భూములకు పట్టా మార్పులు అవుతున్నాయి. ఇందుకోసం సంబంధిత వ్యక్తుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నాడు. తాను సేఫ్‌ సైడ్‌లో ఉండేందుకు ముందుగానే వారితో నోటరీ రాయించి తీసుకుంటున్నాడు.

● ఇటీవల కొత్లాపూర్‌ గ్రామంలోని అసైన్డ్‌ భూములను ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశాడు. ఇందుకోసం వారి నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడు.

● నావంద్గీ ఇసుక రీచ్‌లో అనుమతుల చాటున అవినీతి పర్వం కొనసాగిస్తున్నాడు. నాలుగు ట్రాక్టర్లకు పర్మిట్లు ఇచ్చి పది ట్రాక్టర్ల ఇసుక తరలిస్తూ అంతా కలిసి సొమ్ము చేసుకుంటున్నాడు.

● నావంద్గీ, నీళ్లపల్లిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తనకు కావాల్సింది తీసుకుంటున్న సదరు అధికారి.. సెలవు రోజుల్లో పని చేసుకోండి అంటూ మౌఖిక అనుమతులు ఇస్తున్నాడు.

● పాసుపుస్తకాలు బ్యాంకులలో తనఖా పెట్టిన వారి పేర్లపై ఉన్న భూములను యథేచ్ఛగా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాడు.

● సీలింగ్‌, అసైన్డ్‌, గైరాని భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇందులో సదరు పెద్ద సారుదే ప్రధాన పాత్ర అనేది బహిరంగ రహస్యం.

● కొర్విచెడ్‌, జీవన్గీ, ఎకా్మాయి, క్యాద్గీరా నాపరాతి గనుల్లో లీజులు లేని వారి నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ అక్రమార్కులు గనులు తవ్వుకోవడానికి మద్దతు ఇస్తున్నాడు. డబ్బులు ఇవ్వని వారి గనులను సీజ్‌ చేయడం.. ఆ గనుల్లో నుంచి కోత యంత్రాలను కార్యాలయానికి తీసుకురావడం పరపాటిగా సాగుతోంది.

పైసలిస్తేనే పని కదిలేది

అవినీతి నిరోధక శాఖకు అందిన ఫిర్యాదులు

ప్రభుత్వానికి చేరిన నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement