
వెలగని వీధి దీపాలు
పరిగి: పట్టణ కేంద్రంలోని సాయిరాం కాలనీ లో కొంత కాలంగా వీధి దీపాలు వెలగడం లేదు. కాలనీలో షిర్టీ సాయిబాబా దేవాలయం ఉండటంతో రాత్రి వేళలో పూజలు నిర్వహించేందుకు భక్తులు వస్తుంటారు. దీపాలు పనిచేయకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. పలు స్తంభాలకు వీధి దీపాలు వెలగడం లేదని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారు లు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కార్మికులు లేబర్‌కార్డు
పొందాలి
దౌల్తాబాద్: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్‌కార్డు పొందాలని అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్‌కుమార్ సూచించారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని చల్లాపూర్ గ్రామంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌కార్డులు అందించారు. లేబర్‌కార్డు వల్ల కార్మికులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. ఒకవేళ లేబర్‌కార్డు కలిగి అనారోగ్యం మృతిచెందితే ప్రభుత్వం రూ.1.30లక్షలు పరిహారం అందిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6.30లక్షలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి పులిందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు
కొడంగల్ రూరల్: విద్యార్థులకు రుచికరమైన, మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని తహసీల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్‌లో ఉన్న ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర విద్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించారు. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం వంట గది, భోజనశాల, సరుకుల గది తదితర వాటిని పరిశీలించారు. భోజనశాలలో శుచి శుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దోమ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మండల పరిధిలోని దాదాపూర్ గ్రామ నుంచి ఓ ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి సీఐ అన్వర్‌పాషా అడ్డుకున్నారు. సంబంధించిన ధ్రువ పత్రాలను డ్రైవర్‌ను అడగ్గా.. లేవని సమాధానం చెప్పడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడ అక్రమంగా వ్యాపారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్వాగతం
ఇబ్రహీంపట్నం రూరల్: కలెక్టరేట్‌కు వచ్చిన తెలంగాణ ఫుడ్ కమిషన్ బృందానికి కలెక్టర్ నారాయణరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ అధికారులతో కమిషన్ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అమలుపై సమీక్షించి, సంతృప్తి వ్యక్తంచేశారు.

వెలగని వీధి దీపాలు

వెలగని వీధి దీపాలు

వెలగని వీధి దీపాలు

వెలగని వీధి దీపాలు