తాండూరు రూరల్: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పాములు బెడద రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో కొండచిలువ కనిపించిందని సిబ్బంది తెలిపింది. తాజాగా గురువారం ఎంపీడీఓ గదిలోనే నాగు పాము ప్రత్యక్షమైంది. ఉదయం గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన అటెండర్‌కు విషసర్పం కనిపించింది. ఆయన భయంతో వెంటనే కార్యాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గదిలో ఉన్న నాగుపామును కర్రలతో కొట్టి చంపేశారు. ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎంపీడీఓ, ఏపీఓ, ఎంఈఓ, ఐకేపీ, డీఎల్‌పీఓతో పాటు పలు కార్యాలయాల పరిసరాల్లో ముళ్లపొదలు ఉండటంతో విషసర్పాలు తిరుగుతున్నాయని సిబ్బంది తెలిపారు. నిత్యం భయందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.