
బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం
కొడంగల్ రూరల్: సమాజ హితం కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మహాత్మా బసవేశ్వరుడని వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు కొవూరు విజయవర్ధన్ కీర్తించారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురష్కరించుకొని బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటుకు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలో రావులపల్లి రోడ్డు వద్ద భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కులాలను రూపు మాపడానికి ఉద్యమించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. సమాజంలో ఎలా జీవించాలి, సీ్త్ర, పురుష లింగ బేధాలు, కుల, మత తారతమ్యం లేకుండా అసమానతలను తుడిచి పెడుతూ.. అందరూ సమానమేనని ఉద్బోధించారన్నారు. ఆయన విగ్రహ ఏర్పాటుకు యావత్ హిందూ సమాజం మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. బసవేశ్వరుడి మార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవ చేయడంతోనే నిజమైన ఆనందం పొందే వీలుంటుందని చెప్పారు. కార్యక్రమంలో వీరశైవ సమా జం నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బుక్క విక్రమ్‌కుమార్, కోశాధికారి సూరారం రాకేష్, కొడంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డం శేఖరయ్యస్వామి, యువ సమాజ్ అధ్యక్షుడు తారాపురం రవి, నాయకులు సర్వేష్, జగదీశ్వర్‌స్వామి, మల్లేశం, మల్లికార్జున్, వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.
వీరశైవ సమాజం కొడంగల్ అధ్యక్షుడు విజయవర్ధన్
విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ