
విజయవంతం చేయాలి
ఆవిర్భావ
వేడుకలను
అనంతగిరి: ఈ నెల 6న జరిగే బీజేపీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్‌లోని స్వాగత్ హోటల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభ్యున్నతికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. పని చేసే వారికి పార్టీలో గుర్తుంపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు సదానంద రెడ్డి, ఈశ్వరప్ప, మిట్ట పరమేశ్వర్, నవీన్ కుమార్, బాలేశ్వర్ గుప్తా, సాహూ శ్రీలత, శివరాజ్ గౌడ్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్