ఆ పాదాలకు నూటొక్క వసంతాలు | - | Sakshi
Sakshi News home page

సెంచరీ దాటినా చలాకీగా..!

Published Tue, Jul 18 2023 3:54 AM | Last Updated on Tue, Jul 18 2023 8:23 AM

- - Sakshi

రోజూ రెండు మూడు గంటల నడక.. ఎనిమిది గంటల నిద్ర.. వ్యాయామం.. ఒంటిపూట భోజనం.. మితాహారం.. ఇదంతా దాదాపు యాభై ఏళ్ల నుంచి అలవాటు చేసుకున్నారాయన! ఇప్పుడాయనకు వందేళ్లు దాటాయి. అయినా.. ఇప్పటికీ నడక మానలేదు. వ్యాయామం ఆపలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో రోజుకి 12 కిలోమీటర్లు నడుస్తున్నారు. మంగళవారం 101 ఏట అడుగు పెడుతున్న ఆయన పేరు వి.శ్రీరాములు. ఊరు మచిలీపట్నం. స్థిరపడింది విశాఖపట్నం.

సాక్షి, విశాఖపట్నం: అరవై డబ్భై ఏళ్లకే జీవితం అయిపోయిందనుకుంటూ నిట్టూరుస్తున్న రోజులివి. కానీ.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వి.శ్రీరాములు అలా అనుకోవడం లేదు. వయసు నూరేళ్లు దాటినా.. ఇంకా విదేశాల్లో జరిగే అథ్లెటిక్‌ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. 1923 జూలై 18న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ఆయన తన 21వ ఏట (27 మార్చి 1944లో) అప్పటి రాయల్‌ ఇండియన్‌ నేవీలో చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌గా చేరారు. 1979 డిసెంబర్‌ 31న కమాండర్‌ హోదాలో పదవీ విరమణ చేసి విశాఖలో స్థిరపడ్డారు.

ఆపై ఆరోగ్యాన్నిచ్చే నడకను అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత రేస్‌ వాకింగ్‌తో పాటు రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో వంటి ఆటల్లోనూ సత్తా చాటుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లెక్కకు మిక్కిలి బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. ఏసియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌íÙప్‌ 5, 10, 20 కి.మీ. రేస్‌ వాకింగ్‌ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు, వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ప్స్‌లో 5 బంగారు, 3 రజత పతకాలను కైవసం చేసుకున్నారు.

వెటరన్స్‌ (మాస్టర్స్‌) కేటగిరీలో ఇప్పటికీ ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొంటూ బంగారు, రజత, కాంస్య పతకాలను సాధిస్తూనే ఉన్నారు. అంతేనా? పర్వతారోహణంపైనా మక్కువ ఉన్న శ్రీరాములు 79వ ఏట తన కుమారుడు సాగర్‌తో కలిసి 2002లో ఆఫ్రికాలోని కిలీమాంజారో, 81వ ఏట 2004లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు, 83వ ఏట హిమాలయాల్లోని పిండారీ గ్లేసియర్‌లను అధిరోహించారు. 

ఇంకా అంతర్జాతీయ పోటీలకు సై.. 
శ్రీరాములు 101వ ఏట ఈ ఏడాది నవంబరు 8–12 వరకు ఫిలిప్పీన్స్‌లో జరిగే ఏసియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ కాంపిటిషన్స్‌లో, వచ్చే ఏడాది జూన్‌లో స్వీడన్‌లో నిర్వహించే వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌íÙప్‌–2024 పోటీలకు సిద్ధమవుతున్నారు. శ్రీరాములుది విభిన్న జీవనశైలి. మితంగా తింటారు. ఉదయం మొలకల చట్నీతో ఒక బ్రెడ్‌ టోస్ట్, కాఫీ లేదా మజ్జిగ తీసుకుంటారు. మధ్యాహ్నం పెరుగన్నమే తింటారు. అందులో కూరలు నంజుకుంటారు. సాయంత్రం కప్పు మజ్జిగ లేదా అరటిపండు తీసుకుంటారు. రాత్రికి ఏమీ తినకుండా 7.30కే నిద్రకు ఉపక్రమిస్తారు.

మర్నాడు తెల్లవారుజామున 3.15కి బీచ్‌లో నడకకు బయలుదేరి (12 కి.మీ.) ఉదయం 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వందేళ్ల ప్రాయంలో ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. ఆ్రస్టానమీ, జియో పాలిటిక్స్, నేవీకి సంబంధించిన అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. పిల్లలు స్థిరపడటంతో సతీమణితో కలిసి విశాఖలో ఉంటున్నారు.   

నేడు శతాధిక సంబరాలు..  
శ్రీరాములు 101 ఏటలోకి అడుగిడుతున్న సందర్భంగా విశాఖ బీచ్‌లో సాటి వాకర్‌ స్నేహితులు మంగళవారం ఉదయం ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. మరో విశేషం ఏమంటే.. దేశంలో నేవీలో పనిచేసి వందేళ్లకు పైగా జీవించి ఉన్న ఏకైక అథ్లెట్‌ శ్రీరాములే కావడం విశేషం.   

హ్యాపీగా జీవించడమే లక్ష్యం.. 
నాకేమీ లక్ష్యాలు లేవు. ఉన్నదల్లా ఉన్నన్నాళ్లూ హ్యాపీగా జీవించడమే. నేను ఇప్పటివరకు ఆస్పత్రి మెట్లెక్కలేదు. రక్తపోటు, మధుమేహం సహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆఖరి ఘడియాల్లోనూ ఆస్పత్రికి వెళ్లకూడదన్నది నా ఆశ. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం చేయాలని ఈ తరం వారికి నేనిచ్చే సలహా. నా ఆరోగ్య రహస్యం కూడా అదే. త్వరలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని మెడల్స్‌ సాధిస్తానన్న నమ్మకం ఉంది.  
– వి.శ్రీరాములు, శతాధిక అథ్లెట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement