నేషనల్ యూత్ ఫెస్ట్‌లో ఏయూ విద్యార్థుల సత్తా
శివాని లహరి, హర్షిత
సాక్షి, విశాఖపట్నం : నేషనల్ యూత్ ఫెస్ట్‌లో ఏయూ విద్యార్థులు సత్తా చాటారు. వేర్వేరు విభాగాల్లో విన్నర్, రన్నర్‌లుగా నిలిచారు. ప్రజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ‘ప్రజాతంత్రం–2024’ నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో ఏయూలోని అంబేడ్కర్ న్యాయ కళాశాలకు చెందిన దేవగుప్తపు హర్షిత, శివాని లహరి పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకూ లక్నోలో జరిగిన ఫైనల్స్‌లో పాలసీ వ్యవహారాలపై జరిగిన డిబేట్ పోటీల్లో హర్షిత అదరగొట్టింది. దేశంలోని వివిధ కాలేజీలకు చెందిన 18 మందిని వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. సామాన్య ప్రజలను పరిపాలనలో ఎలా భాగస్వామ్యం చేస్తారనే అంశంపై జరిగిన పోటీల్లో మైలవరపు శివాని లహరి అద్భుత ప్రతిభ కనబరిచి సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అవార్డులు సాధించిన విద్యార్థినులను ఏయూ వీసీ శశిభూషణరావు, న్యాయకళాశాల ప్రిన్సిపాల్ సీతామాణిక్యం, మెంటార్ పల్లవి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment