జైలులో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో మహిళా ఖైదీల కోసం శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌ను బుధవారం జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ని మహిళా ఖైదీల బ్లాక్ వద్ద ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని దీని ఏర్పాటుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ యూనిట్‌లో మహిళా ఖైదీలే పనిచేస్తారని, వారికి ఈ యూనిట్ ఆర్థికంగా కూడా సహాయపడుతుందన్నారు. ఇక్కడ తయారైన నాప్కిన్లను భవిష్యత్‌లో రాష్ట్రంలో ఇతర జైళ్లకు సరఫరా చేసే చర్యలు చేపడతామన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు సాయి ప్రవీణ్, సూర్యకుమార్, జవహర్‌బాబు, జైలర్లు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment