● రెండు, మూడు దశాబ్దాలుగా ఒకే చోట విధులు ● ఈపీడీసీఎల్
విజి‘లెన్స్’కూడా లేదు
చేసేది చిన్న ఉద్యోగమైనా వీరంతా కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. తమ సెక్షన్ పరిధిలో ఏ పనికి వచ్చినా వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్టీ డివిజన్‌లో ఎల్‌టీ మీటర్, హెచ్‌టీ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ విభాగాలుంటాయి. ఎంఆర్టీ యూనియన్ రా‘రాజు’గా చెలామణి అవుతూ మూడు దశాబ్దాలుగా ఎల్‌టీ మీటర్ సెక్షన్‌లోనే పనిచేస్తున్నారు. ఎవరికై నా ఎక్కువ బిల్లు వస్తే మీటర్ టెస్టింగ్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఈ సమయంలోనే వీరంతా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తారు. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో మీటర్‌లో తప్పుందంటూ సర్టిఫై చేసి వినియోగదారుల దగ్గర నుంచి అందినకాడికి గుంజుకుంటారు. వీరిపై పలుమార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. వీరికి గోపాలపట్నం కార్యాలయంలోని కొందరు అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. పలుమార్లు ఎంఆర్టీ ఉద్యోగుల వ్యవహారశైలిపై ఈపీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదులు అందినా కనీసం స్పందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment