వందేళ్ల రైల్వే విద్యుదీకరణ వేడుకలు
తాటిచెట్లపాలెం: భారతీయ రైల్వేలో విద్యుదీకరణ జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో వేడుకలు ఘనంగా జరిగాయి. డీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహూ ఆధ్వర్యంలో దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు వాక్‌థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ మొదటి ఎలక్ట్రికల్ రైలు 1925 ఫిబ్రవరి 3న ప్లాట్‌ఫాం 2 పూర్వపు విక్టోరియా టెర్మినస్(ప్రస్తుత ఛత్రపతి శివాజీ టెర్మినస్) నుంచి కుర్లా స్టేషన్‌కు నడిచిందన్నారు. దీనికి గుర్తుగా భారతీయ రైల్వే పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందేళ్లలో జరిగిన ప్రగతిపై ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ట్రాక్షన్) బి.షణ్ముఖరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డివిజన్ పరిధి పలు విభాగాలకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment