జీబీఎస్‌పై ఆందోళన వద్దు
కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్
మహారాణిపేట: గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) అంటువ్యాధి కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ భరోసానిచ్చారు. ఆంధ్రా మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యుల ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. కేజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని. కేసులు పెరుగుతున్నా భయాందోళన చెందనక్కర్లేదన్నారు. కేజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.గోపి మాట్లాడుతూ జీబీఎస్ వ్యాధి గురించి సమగ్రంగా వివరించారు. క్లినికల్ ప్రైజేంటేషన్, డయాగ్నస్టిక్ విధానాలు, సమకాలీన చికిత్స వ్యూహాల్లో కీలక విషయాలను తెలిపారు. ఇది కరోనా వైరస్‌లా అంటువ్యాధి కాదని, ఇమ్యూన్ సిస్ట్‌ం వల్ల నాడీ వ్యవస్థ పైపొర దెబ్బ తినడం వల్ల వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment