9,300 కేసులు.. రూ.46 లక్షల జరిమానా
● వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 12న డ్రైవ్ ప్రారంభం కాగా.. ప్రయాణికుల భద్రతా ప్రమాణాల పరిశీలన, టికెట్ తనిఖీలు చేపడుతున్నారు. సరైన టికెట్ లేకుండా రిజర్వేషన్, దివ్యాంగ, మహిళల బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 18 వరకు కమర్షియల్ సిబ్బంది 9,300 కేసులు నమోదు చేసి, రూ.46 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ నెల 28వ వరకు తనిఖీలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment