ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
పెందుర్తి : ఫుడ్ పాయిజన్ కారణంగా పెందుర్తిలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వివరాలివి.. పెందుర్తి వెలంపేట సమీపంలో ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి కళాశాల ఆధ్వర్యంలో ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్నాక్స్, బిర్యానీ తిన్నారు. బుధవారం ఉదయం నుంచి వెన్నెల దివ్య, లలిత కుమారి, సంధ్య, వణుకుల మాధవి సహా ఆరుగురు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారిని 108లో పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో పెందుర్తి సీహెచ్‌సీకి వచ్చి విద్యార్థినులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షించారు. మాధవి అనే విద్యార్థిని పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్) డాక్టర్ పి.శంకర్‌ప్రసాద్, సీహెచ్‌సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.అవంతి, వైద్యాధికారులు డాక్టర్ బి.బాబాసాహెబ్, డాక్టర్ దివ్య సౌజన్య, డాక్టర్ హరిత, హెడ్ నర్స్ లిల్లీ గ్రేస్, వైద్య సిబ్బంది విద్యార్థినుల ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కళాశాల వసతులపై డీఎంహెచ్‌వో సీరియస్
ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ పరిసరాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థినుల హాస్టల్, మరుగుదొడ్లు, ఇతర పరిసరాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. తాగునీటి సదుపాయం కూడా పూర్తిస్థాయిలో లేదు. విద్యార్థినులకు కలుషిత నీరు అందుతున్నట్లు డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు గుర్తించారు. కళాశాల నిర్వాహకులపై మండిపడ్డారు. ఇలాంటి పరిసరాల్లో కళాశాల, హాస్టల్ నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఒకరి పరిస్థితి విషమం,
ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
పెందుర్తిలోని ఇందిరా స్కూల్ ఆఫ్
నర్సింగ్‌లో ఫుడ్ పాయిజన్
ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment