సత్వర న్యాయఫలాలకు మధ్యవర్తిత్వం మేలు
విశాఖ లీగల్ : కక్షిదారులకు సత్వర న్యాయఫలాలు అందించే ప్రక్రియలో మధ్యవర్తిత్వాన్ని అనుసరించడం ఎంతో మేలు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. మధ్యవర్తిత్వ శిక్షణా శిబిరం ముగింపు, మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కి సంబంధించి సమన్వయ కమిటీల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక శాతం కేసులు రాజీ చేయాలని కమిటీ సభ్యులను, న్యాయవాదులను, వివిధ కంపెనీల ప్రతినిధులను కోరారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడుతూ మధ్వవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడం ఉభయులకు లాభదాయకమన్నారు. కేసుల రాజీకి న్యాయవాదులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి రాధా రాణి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వెంకటరమణ, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి.శేషమ్మ, విశాఖ న్యాయవాదుల సంఘం కార్యదర్శి తాళ్లూరు రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment