ఈ–శ్రమ్ నమోదుతో బీమా సౌకర్యం
మహారాణిపేట: మత్స్యకారులు, మత్స్య అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు తప్పనిసరిగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ఫ్లాట్‌ఫాం(ఎన్‌ఎఫ్‌డీపీ)లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ) పి.లక్ష్మణరావు సూచించారు. శుక్రవారం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో పీఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన(పీఎంఎంకేఎస్‌ఎస్‌వై) పథకంపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. మత్స్యకారులను అసంఘటిత కార్మికులుగా గుర్తించేందుకు ఈ–శ్రమ్ నమోదు చేయించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ బీమా సౌకర్యం పొందవచ్చన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖ జోనల్ డైరెక్టర్ భామిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, అవకాశాలను వివరించారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ) హైదరాబాద్ అధికారి సుజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి, వాటిని పొందేందుకు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌డీపీ ఈ శ్రమ్ కార్డుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎఫ్‌పీహెచ్‌ఏటీటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మీనా, సీఐఎఫ్‌ఎన్‌ఈటీ డిప్యూటీ డైరెక్టర్ బిష్ణోమ్, మత్స్యశాఖ ఎఫ్‌డివోలు ఆశాజ్యోతి, మురళి, డీపీఎం కృష్ణ, ఎంపెడా ప్రతినిధి హనుమంతరావు, రాష్ట్ర మరపడవల సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, వివిధ సంఘాల నాయకులు సీహెచ్ వీర్రాజు, సీహెచ్ పొతురాజు, పరదేశి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment