గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య
పెందుర్తి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి నరవలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరవ సమీపంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా గ్రావెల్ తవ్వకాలు జరిగిన గొయ్యిలో హత్యకు గురైన వ్యక్తిని దహనం చేశారు. సగానికి పైగా కాలిపోయిన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నరవ సమీపంలోని ఓ క్వారీ గొయ్యిలో సుమారు 25–35 వయసు కలిగిన యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మాట్లాడుతూ మృతుడు నీలం రంగు ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. పెందుర్తితో పాటు నగరం, ఇతర ప్రాంత పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులను పరిశీలించి మృతుని వివరాల కోసం ఆరా తీస్తామన్నారు. సమాచారం కోసం 94407 96039, 96767 97314 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు.
నరవ క్వారీలో దహనం చేసిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment