డ్రగ్స్ నిర్మూలనకు చేతులు కలపాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ సూచన
విశాఖ సిటీ : విశాఖలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్, ఆర్‌పీఎఫ్, ఎన్‌సీబీ, కస్టమ్స్, పోర్టు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో చేతులు కలపాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో మత్తు పదార్థాల రవాణా నియంత్రణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ కేసుల్లో అరెస్టయిన 700 మందిలో 400 ఎస్టీలే ఉన్నారని తెలిపారు. కేవలం రూ.వెయ్యి, రూ.2 వేలు కోసం రవాణా చేస్తూ దొరికిపోయి జైలులో నెలల తరబడి ఉండిపోతున్నారని పేర్కొన్నారు. వారికి బెయి ల్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూ డా తెలియదన్నారు. తొలిసారిగా ఎన్‌డీపీఎస్ కేసులో అరెస్టయిన అల్లూరి జిల్లాకు చెందిన వారికి తొలుత బెయిల్ ఇవ్వాలన్నారు. దీనిపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఒడి శా, అల్లూరి జిల్లా నుంచి గంజాయి వస్తోందన్నారు. కొందరు కింగ్‌పిన్‌లు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఆశ కల్పిస్తున్నారని, ఫలి తంగా గిరిజన రైతులు గంజాయి సాగుపై ఆకర్షితులవుతున్నారని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారికి కాఫీ విత్తనాలు, మిరియాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
గోవా, కర్నాటక నుంచి సింథటిక్ డ్రగ్స్
సింథటిక్ డ్రగ్స్ గోవా, కర్నాటక నుంచి నగరంలోకి వస్తున్నట్లు సీపీ తెలిపారు. గంజాయి చాక్లెట్లు బిహార్ నుంచి వస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని, అలాగే ఉత్తరప్రదేశ్‌లో వాటి ని తయారు చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు. విశాఖ పోలీసులు అక్కడకు వెళ్లి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ పరిశ్రమను సీజ్ చేయించినట్లు చెప్పారు. ఏజెన్సీ నుంచి గంజాయితో పాటు ఇతర డ్రగ్స్‌ను విశా ఖ నుంచి పది సంప్రదాయ మార్గాల ద్వారా దేశంలో ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతున్నట్లు తెలిపారు. గంజాయిని కొరియర్ ద్వారానే కాకుండా విమానాల ద్వారా కూడా రవాణా చేసినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. ఇప్పటికే గంజాయి రవాణాదారులను అరెస్టులు చేశామని, ప్రస్తుతం కోర్టుల్లో 134 ఎన్‌డీపీఎస్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని వచ్చే నెలలో ధ్వంసం చేయనున్నట్లు తెలిపారు.
ఐదుగురిపై పీడీ యాక్ట్ అమలు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఏడుగురిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సీపీ పేర్కొన్నారు. వీరిలో ఐదుగురిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు చెప్పారు. మరికొంత మందిపై కూ డా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టకు ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బందిని కూడా బందోబస్తు సమయాల్లో వెనక్కి తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. రవాణాదారులు శివారు ప్రాంతాల్లో ని ఖాళీ గొడౌన్లు, గుడిసెలలో గంజాయిని ని ల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. డ్రగ్స్ గ్యాంగ్‌లో కింగ్ పిన్‌లను గుర్తించి, వారిని అరెస్టులు చేసి, వారి ఆస్తులను జప్తు చేయడంపై దృష్టి సారించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment