నేడు మహాకుంభాభిషేకం
బీచ్‌రోడ్డు: మహా శివరాత్రి వేడుకలకు ఆర్.కె.బీచ్ సిద్ధమైంది. డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 40వ మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా 39 ఏళ్లుగా మహా కుంభాభిషే కం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్సార్) తెలిపారు. సిరిపురం సమీపంలోని ఆయన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఈ ఏడాది శివ లింగాలకు అభిషే కం చేస్తామన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో భక్తులతో స్వయంగా అభిషేకం చేయిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి కల్యాణం, 4.30 గంటలకు హోమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదు ప్రదానం చేస్తామని, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హాజరవుతున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రఖ్యాత కళాకారుడు గుమ్మిడి గోపాలకృష్ణ దర్శకత్వం, పద్య రచనలో 45 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. నంది అవార్డు గ్రహీత శ్రీ వంకాయల మారుతీప్రసాద్ బృందంచే పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment