భోజన పథకంపై తనిఖీలు
మాధవధార స్కూల్‌లో లోపాలు బట్టబయలు
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుపై జిల్లా విద్యాశాఖాధికారులు తనిఖీలు చేపట్టారు. ‘రుచీ లేదు.. శుచీ లేదు’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ స్పందించి మాధవధార హైస్కూ ల్‌ను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు, గోపాలపట్నం ఎంఈవో దివాకర్ మంగళవారం మాధవధార స్కూల్‌ను తనిఖీ చేశారు. ముందుగా భోజన పథకం నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో ఐదు రోజులుగా ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారనేది ఎండీఎం యాప్‌లో చూశారు. ఐదు రోజులుగా కేవలం ఒక్కరే భోజనం తినలేదని నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేసిన విషయాన్ని గుర్తించారు. దీంతో మంగళవారం పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, భోజనం తిన్న విద్యార్థులను తరగతుల వారీగా లెక్కించారు. 630 మంది విద్యార్థులు బడికి హాజరైతే, వీరిలో 591 మంది భోజనం తీసుకున్నట్లుగా తేలింది. ఈ లెక్కన 39 మంది భోజనం తినలేదనేది వెల్లడైంది. దీన్ని బట్టి ఇక్కడి నిర్వాహకులు ఎండీఎం యాప్‌లో తప్పు డు నివేదికలను పొందుపరుస్తున్నట్లుగా గుర్తించారు. పరిశీలనలో వెల్లడైన అంశాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ఒక్క మా ధవధార స్కూల్లోనే ఇలా ఉందా? లేక జిల్లా వ్యాప్తంగా ఇదే రీతిన అంకెల గారెడీ జరుగుతుందా? అనేది లోతుగా పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.
భోజన పథకంపై తనిఖీలు
భోజన పథకంపై తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment